అమ్మ పెట్టినది బొమ్మలకొలువులు;
బయటికి తీసెను ఎన్నో బొమ్మలు;
ట్రంకు పెట్టెలో , అలమరు,
అటకలు, భోషాణములలొ;
ఇన్నినాళ్ళుగా దాగున్నవి అవి!;
అబ్బో! ఎన్నో సొగసరి బొమ్మలు;
అక్క! అన్నా! చెల్లీ రండి!
బూజులు దులిపీ, ముస్తాబులు చేద్దాం!
వెలతెలబోతూ వెలిసి పోయిన బొమ్మలకిప్పుడు;
రంగుల సొబగులు, తీర్చి దిద్దుదాం! ||
క్లే మౌల్డింగులు, బంకమన్నులతొ,
ప్లాస్టర్ పారిస్, క్రేపు పేపర్లు, వేస్టు వస్తువులు
పెయింటింగులు, ఓరిగమీలు
సరికొత్త రకాలను అదనముగా
ఇంకా మరిన్ని చేర్చేసేద్దాం!
బొమ్మల కొలువుకు మెరుగులు దిద్దీ
“మీ కళా ప్రపంచము శహభాష్! ” అంటూ
అందరు మనలను మెచ్చుకునేలా
గృహసామ్రాజ్యమును ఇంపుగ సృష్టిద్దాము!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
రచయిత్రి; కాదంబరి, (konamanini.blogspot.com)
చాలా బాగా చెప్పారు. ఆగండి నేను కూడా నా బొమ్మలను తీస్తాను! సంక్రాంతి శుభాకాంక్షలు!
Good One.
సంక్రాంతి శుభాకాంక్షలు .
ధన్యవాదాలు.
ఈ సంక్రాంతి అందరికీ సుఖశాంతులు భోగ భాగ్యాలు కలిగించాలని,
సంక్రాంతి శుభాకాంక్షలు.
నా బొమ్మలకొలువు 2012 కవితా గీతిక పై
మీ అభిప్రాయాలకు నాకు ఆనందంగా ఉన్నది.
పఠితలకు Many many THANKS.
wishing you HAPPY PONGAL,
kadambari
ForKids,
రసజ్ఞ గారూ!
స్నేహ గారూ
మాలాకుమార్ గారూ
ధన్యవాదములతో, సంక్రాంతి శుభాకాంక్షలు.
Happy సంక్రాంతి kadambari garu!
Nice poems forKids,
“అక్క! అన్నా! చెల్లీ రండి!”
Very nice bhavamu, and to sing.