
మంగుళూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఉల్లాస్ దుర్గము.
అరేబియా సముద్రము ఒడ్డున ఉన్న ullal Fortలోని ఒక వీర మహిళామణి సాహస గాథలను
అరేబియా మహా సాగర కెరటాల హోరులో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
ఆమె పేరు “మహా రాణి అబ్బక్క”.
“అభయ రాణి” అనే బిరుద నామముతో
ప్రజలు ఆమెను పిలుస్తారు.
అబ్బక్కా దేవి బాల్యం, ఉల్లాల్ తీరములో ఆనందముగా గడిచింది.
(ఉల్లల్ కే నేటి పేరు సోమేశ్వర బీచ్)
16 వశతాబ్దము పూర్వార్ధములో మంగుళూరు నేలను పునీతం చేసిన సమర గాధ ఇది.
తులు ప్రాంతాలను, మంగుళూరునూ,
ఆ ప్రాంతాలను ప్రాచీన నేపథ్యం కల “అలుపా వంశమునకు చెందిన రాజు” పరిపాలిస్తున్నాడు.
గోవా సముద్ర తీరంలో కొందరు దిగారు.
వారు వర్తకం పేరుతో ఈ సీమలో అడుగు పెట్టిన పోర్చుగీసులు.
(వీరినే “బుడతకీచులు” అని కూడా తెలుగు వారు పిలిచే వాళ్ళు)
(16 century Potuguese;enter Goa as traders)
బలిష్ఠమైన కోట “ఉల్లాల్”వద్ద పోర్చుగీసులు తిష్ఠ వేసారు.
అరేబియా దేశాలతో లవంగము, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తూ,
ఉల్లాల్ దుర్గము ధనరాసులతో విలసిల్లుతూన్నది.
వాళ్ళు “గోవా ప్రాంతానికి పట్టుగొమ్మ ఉల్లాల్ ఫోర్ట్”- అని కనిపెట్టారు,
నెమ్మదిగా తమ ఆధిక్యతను పెంచుకున్నారు.
(ఈ అధికారాన్ని డచ్, ఫ్రెంచ్, బ్రిటీష్ వారు పరస్పరం బలాబలాలు తేల్చుకుంటూ,
ఒకరి వెనుక ఒకరు దురాక్రమణ చేసారు)
అప్పటి పాశ్చాత్య వలస విధానపు ట్రిక్కులతో- అలుపా చక్రవర్తి సింహాసనం కోల్పోయాడు.
అబ్బక్క మహారాణి, ఆ తరుణంలో మూడబిద్రి పట్టణమును రాజధానిగా పరిపాలిస్తూన్నది.
ఉలాల్ ను ఆర్ధిక కేంద్రముగా ఆమె పాలన చేస్తూండేది.
ఆమె మేనమామ తిరుమలరాయలు ;
అతడు “స్త్రీలు కేవలం అంతః పురమనకే పరిమితం కారాదు,
దేశ రక్షణలో వారు కూడా అవిభావ భాగస్వామ్యులే!” అనే
అభిప్రాయాలను కలిగి ఉన్న మనీషి.
గురుత్వములో దేశభక్తి- ఆమె వ్యక్తిత్వముగా రంగరించబడినది.
తిరుమలరాయలు మాతృదేశ స్వాతంత్ర్యము పట్ల ప్రేమ, భక్తిలను, ఉద్బోధిస్తూ,
ఆమెకు యుద్ధ విద్యలను కూడా నేర్పాడు.
పాలనా దక్షత, ఆర్ధిక అంశ నైపుణ్యాలు,
సాహస యుద్ధ విద్యలలో అబ్బక్క కు దీటైన వారు లేరు.
అబ్బక్క మహారాణి, ఆ తరుణంలో మూడబిద్రి పట్టణమును రాజధానిగా పరిపాలిస్తూన్నది.
ఉలాల్ ను ఆర్ధిక కేంద్రముగా ఆమె పాలన చేస్తూండేది.
తిరుమలరాయలు శిక్షణలో సైనిక దళముల నిర్మాణములో, పాలన పట్ల
అబ్బక్కా దేవికి మంచి అవగాహన ఏర్పడినది.
కత్తియుద్ధంలో తనకు తానే సాటి. మెరుపులా ఉండేది ఆమె ఖడ్గచాలనము.
అంతే కాదు, అబ్బక్క విలువిద్యలో కూడా నిపుణురాలే!
మన చరిత్రలో:- సమయోచిత నిర్ణయాలను తీసుకోగల ఏకైక భారత నారీ మణి అబ్బక్క మాత్రమే!
ఆ మహిళామణి నాలుగు దశాబ్దాల పాటు పోర్చుగీసువారిని సాగర తీరం దాటి రాలేనంతగా
తన సామ్రాజ్య, సైనిక విధానాలను రూపొందించిన స్త్రీ.
నౌకా బలములను సైన్యంలో ప్రవేశపెట్టిన ప్రజ్ఞా శీలిని, యోధురాలు.
అబ్బక్కకు వివాహం చేసే యుక్త వయస్సు వచ్చింది.
ఆమె యొక్క ఆకాంక్షలను, మాతృభూమీ పాలనా బాధ్యతలను
సమర్ధవంతంగా నిర్వహించ గల యువకునితో పెళ్ళి నిశ్చయించారు.
అబ్బక్క “వరుడు పాలనా చక్రాన్ని త్రిప్పగల మేధావి,
రణరంగంలో వెనకడుగు వేయని వీరాధివీరుడు,విద్యావంతుడు, గుణవంతుడు
ఐఉండాలని” అభిలషించింది.
తిరుమలరాయలు ఆమె ఆలోచనలలో సరితూగిన పురుషుని పెళ్ళికొడుకుగా నిర్ణయించాడు.
అతడు పొరుగు రాజ్యమైన మంగుళూరు రాజ్యాధీశుని పుత్రుడు, లక్ష్మణప.
పోర్చుగీసులను అదుపులో పెట్టడానికై తిరుమలరాయడు(Tirumala Raya),
“తులు రాజ్య పరిధి” (Tulu belt)తో విడి విడిగా ఉన్న
ఆయా ప్రాంతాలను ఏక సీమగా-
నిర్మాణం చేయాలని సమకట్టాడు.
రాజ్యమును బలోపేతం చేయడానికై, అబ్బక్క వివాహముతో కొత్త బంధుత్వాలను కలిపి,
సుదృఢ సామ్రాజ్యాన్ని నిర్మించ దలచాడు తిరుమల రాయడు.
రాయని యోచనకు అనుగుణంగా,
అక్కమ్మ భర్త లక్ష్మణప్ప సాహస యోద్ధయే!
(dashing young king showing a lot of promise)
ఉల్లాల్, మంగుళూరు రాజ్యాల మధ్య, వివాహ బంధము ఏర్పడినది.
ఇప్పుడు ఏర్పడిన ఈ కొత్త చుట్టరికాలు- పోర్చుగీసులకు దడ పుట్టించినాయి.
దక్షిణ భారత దేశములో వాళ్ళు, పాశ్చాత్యులు – సీమాక్రమణకు అడ్డుకట్ట వేసినట్లే ఐనది.
పోర్చుగీసు వైస్రాయ్ కుయుక్తులు పన్నసాగాడు.
అందులో భాగంగా- ఆంటోనియో నోరోన్హ
(Portuguese Viceroy in Goa, António Noronha)
“నీవు యావత్ భారత దేశానికే సామ్రాట్ వి ఔదువు గాని” అంటూ చెప్పాడు.
లక్ష్మణప్ప దురాశాపరునిగా మారాడు.
అతడు లక్ష్మణప్పకు సహాయం చేస్తున్నట్లు నటించసాగాడు.
ఆ బుడతకీచుల పన్నాగంలో సులభంగా పడ్డాడు.
అబ్బక్కకు ఇద్దరు కుమార్తెలు, కవల పిల్లలు జన్మించారు. !!!!!!!!!!!!!!
“భర్త దేశభక్తిని (patriotism)విడిచి/ విడనాడాడు .
పాశ్చాత్యుల ప్రలోభంలో పడ్డాడు, ఎంత మాత్రమూ సహించరాని విషయం ఇది.
మాతృభూమికి ద్రోహం తలపెట్టిన వారిని, క్షమించరాని నేరము.
“తన అర్ధాంగి ఎంత నచ్చజెప్పినప్పటికీ,
లక్ష్మణప్ప తాను త్రొక్కుతూన్న దారి ముళ్ళబాట – అని తెలుసుకోలేకున్నాడు.
Abbakka Rani, the Queen of Spices ఇందుగురించి అబ్బక్క భర్తతో ఎన్నో విధాల వాదించింది.
విదేశీయుల మాయలో, త్రాగుబోతుగా మారిన భర్తను చూస్తూ ఆమె విల విల్లాడింది.
కానీ ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్ధం ఐనాయి.
లక్ష్మణప్ప క్రమ క్రమంగా సంస్కారహీనుడైనాడు.
అతడి అబ్బక్కను విపరీతంగా కొట్టడానికి కూడా జంకలేదు.
విద్యా విజ్ఞానాలలో ఉన్నత సంస్కార శిఖరాలను అధివసించిన వనితా శిరోరత్నము.
ఇన్నాళ్ళూ కూడగట్టుకున్న ఓరిమి నిష్ఫలమైంది.భర్త దురాగతాలను ఎదిరించింది.
ఓరిమి నిష్ఫలమైంది.భర్త దురాగతాలను ఎదిరించింది.
తన పుత్రికలను ఇద్దరినీ, తీసుకుని బయలుదేరింది.
మంగుళూరు రాజ్యాన్ని వదలివేసి,
“మూడబిద్రి” ni chEriMdi.
ఆమె ఉల్లాల్ (Moodabidri and Ullal) నగరమును కేంద్రముగా చేసుకొని
తన రాజ్యాన్ని పరిపాలించసాగింది.
ఆమె ఇదివరకు ఉన్న సైన్య బలగాలను మరింత దృఢంగా చేయసాగింది.
నేవీ దళాలను (Navy )ను కూడా అభివృద్ధి చేయసాగినది.
1557లో అరేబియన్ సముద్ర జలాలు, పోర్చుగీసుల రాకతో కల్లోలం అయ్యాయి.
మంగుళూరు కోటను వారు ఆక్రమించారు. వీరనారి అబ్బక్క ,
నిర్ద్వంద్వంగా వారి ఆధిపత్యాన్ని తిరస్కరించింది.
అందుకని, పాశ్చాత్యులు, ఆమె ఉంటూన్న ఉల్లాల్ దుర్గాన్ని ముట్టడించారు.
స్వంత మనుష్యుల నమ్మకద్రోహమే భారత దేశాన్ని బానిస సంకెళ్ళలో బందీలై,
అస్వతంత్రముగా దేశం 300 ఏళ్ళ పాటు ఉండడానికి కారణమైనది,
అనే చేదు నిజము మన దేశ చరిత్రలో అనేకమార్లు ఋజువు ఐనది.
1566 లలో కూడా Indian Historyలో ఇదే జరిగినది.
అబ్బక్క ను కపటోపాయాలతో బంధించారు.
ఆమె చెరసాలలో కారాగారంలో కూడా తిరుగుబాటు చేసి,
అక్కడ jail కూడా యుద్ధం చేస్తూ
వీర మరణం పొందింది.
జనవరి 15 , 2003 లో Indian Postal Department వారు
మహారాణి అబ్బక్క పేరుతో స్పెషల్ కవర్ ను రూపొందించారు.
జనవరి నాలుగవ వారములో “అబ్బక్క పండుగ” ను
దక్షిణ కర్ణాటక రాష్ట్రములో మంగుళూరు, చుట్టుపక్కల పరగణాల ప్రజలు వీరోత్సాహంతో చేస్తారు
( చారిత్రక కథ :- కాదంబరి ) konamanini.blogspot.com)
అద్భుత వీరగాధ . ఆవీరనారీమణికి జోహారులు
Thank you, sir!
దుర్గేశ్వర రావు గారూ!
మీ పఠితల అభిప్రాయాలే
మాకు నూతన ప్రోత్సాహాలు.
మీకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2012