![]()
అనగనగా ఒక చిన్న ఊరు
ఆ ఊరులోఒక షాహుకారు
తీర్థయాత్రలకు బయల్దేరారు
ముందుగ తిరుపతి జేరారు
శ్రీనివాసుని దర్శించారు
గరుడాళ్వారుని పరికించారు
తలనీలాలర్పించారు
భద్రాచలం చేరారు
గోదావరిలో మునిగారు
భద్రాద్రి రాముణ్ణి చూసారు
హనుమంతునికి మ్రొక్కారు
ఇంటికి తిరిగి వచ్చారు, పదిమందిని సమావేశ పరిచారు
తన సందేహం తీర్చమన్నారు
ఒక చెయ్యి పైకి మరొకటి క్రిందకు బాలాజీ ఎందుకు పెట్టారు?
తిరుమలలో గరుత్మంతుడు ఎందుకు అరచేతులు చూపారు?
భద్రాద్రిలో ఆంజనేయుడు చేతులెందుకు జోడించాడు?
చూపుడు వ్రేలు బ్రొటనవ్రేలు కలిపి రాముడేల చూపారు?
గరుడుడుది సేవ, వెంకన్నది అభయముద్ర
మారుతిది భక్తి రామునిది రక్ష
ఇవే వారి భంగిమలకు అర్ధం
అని పలువురు వివరించారు
షాహుకారు తృప్తి చెందలేదు, తల అడ్డంగా తిప్పారు
అప్పుడు శాస్త్రిగారు లేచారు, గొంతుకు సవరించుకున్నారు
అయ్యా శ్రద్ధగావినండి
ఈ భూమిమీద పండిన పొగాకు ఇంతెత్తు ఎదుగుతుందని
కుడిచెయ్యి పైకెత్తి ఏడుకొండలవాడు ధృవీకరిస్తే
ఆ పొగాకు ఇంత వెడల్పు వుంటుందని, అరచేతులను జాపి గరుడాళ్వారు శెలవిచ్చారు
భద్రాద్రిలో హనుమంతుడు చేతులు జోడించి ఆ పొగాకు మందం ఇంత అని చూపారు
ఆ పొగాకు నశ్యంచేసి అమ్మితే లాభాలమిద లాభాలొస్తాయని
శ్రీరాములవారు తమమృదువైనవ్రేళ్ళతో పొడుంపట్టేవిధానం సూచించారు
శ్రీమద్రమారమణ గోవిందోహరి
షాహుకారు మెచ్చుకోలుగా తలవూపారు
శాస్త్రిగారిని పొగిడారు ఘనంగా సత్కరించారు
తమ నశ్యం వ్యాపారిని తగినట్లు చెప్పేసరికి, వెర్రి షావుకారు ఉబ్బితబ్బిబైనాడు.
సరదగా ఉండటంతో మిగిలినవారు నవ్వుకున్నారు.
పిల్లలు పొగాకు ఆరోగ్యానికి హానికరం. కథలో సరదాకి చెప్పానే కాని పొగాకు త్రాగరాదు. సరదాగ కథ చదివి నవ్వుకొండి, సరేనా…
Nice
Suuuuuuuuper
nice story
ha ha ha. Nice