చూడ కనుల వేడుక,
ఎన్నదగిన పండుగ
ఘనమైన దీపావళి; || చూడ ||
;
వధూ వరులకు మల్లే
విష్ణు భూచక్రాలు
భూమి పెళ్ళి పీటలను
అందముగా అమర్చరే! ||ఎన్న||
;
చిచుబుడ్డి, ఫౌంటెన్ ల వెలుగులు
చుక్కల పూ దోటలు
మరల తిమిర నింగిలోకి
చందమామ మరలి వచ్చు ||ఎన్న||
;
దిశలందున,
బుస బుసల పొగ పొంగులు
పాముబిళ్ళ పడగలు
కైలాస నాధుడీ ఇలకు
సత్వరమే వచ్చును ||ఎన్న||
;
టెలి ఫోన్ లూ, బటర్ ఫ్లైలు
బెలూను, పారచ్యూటులూ
ఆధునికం ఫెస్టివల్
చూడ కనుల వేడుక
ఎన్నదగిన పండుగ ||ఎన్న||
;
Kadambari Piduri http://konamanini.blogspot.com/

Mee Deepavali Chala Bagundhi. Pata taram Kotha Taram kalipi raasaru
Very good.
very nice poem.
Deepaawali Subhaakaankshalu.
మీ ఆసక్తియే మా rachanalaku,పాటలకు
మంచి స్ఫూర్తిని ఇస్తూన్నాయి.
కృతజ్ఞతలు కూచిమంచి నాగేంద్ర గారూ!
మీ ఆసక్తియే మా పాటలకు మంచి స్ఫూర్తిని ఇస్తూన్నాయి.
కృతజ్ఞతలు కూచిమంచి నాగేంద్ర గారూ!
_ kadanbari
;