రచన: కాదంబరి
నీ కన్న తల్లి యశోదమ్మ ముందరనా,
ఏమిన్ని మాయలు, నటనలూ, ఆటలూ
చిన్నారి క్రిష్ణయ్య! కితకితలు ఆపవూ!? ||
మిన్నులను తాకేటి విశ్వ రూపములను;
కన్నులకు బొమ్మగా కట్టించినావు;
చిన్ని క్రిష్ణయ్యా!
నా కన్నులు చిన్నవి, చింతాకు లంతవి,
అన్నన్ని చిత్రములు ఎటుల పట్టేను? ||
మిరుమిట్ల జిగినీలు, ఆయె నీ కనుదోయి;
వరముల బరువాయె- నీ సృష్టి విభ్రాంతి
పురి విప్పనీవోయి భువనముల అందాలు
తురుముకోకుండునా ఎవరి నయనాలైన!? ||
( రచన:- కాదంబరి http://akhilavanitha.blogspot.com )

భువనముల అందాలు
పురి విప్పనీవోయి
marvellous!
sirisha vedagiri
fine poem. nice
అబ్బా..ఎంత అందంగా రాశారండి…చాలా బాగుంది….
Thank you, vedagiri sirisha!
Thank you, mohan gaaruu!
Thankyou sai bharadwaj