రచన, నిర్వహణ : జ్యోతిర్మయి
పాల్గొన్న చిన్నారులు :
ప్రభాత్ కొత్త, తరుణ్ కింతలి, సాధన సూర్యదేవర, వెన్నెల మద్దూరి, రేష్మ మల్లీడి, శివాని నాగమళ్ల, శీతల్ డోకి, అనన్య గోడే, మహతి చాగంటిపాటి,
అనూవ గుత్తికొండ, ప్రీతిక రత్నం, విష్ణవి వడ్లమాని, విజయ్ మాడపాకుల, సుమాకర్ మేడికయాల, సాకేత్ ఆవులపాటి, అనిరుద్ డోకి, ధీరజ్ పన్నెం
ప్రవీణ్ కింతలి, రితిక వాచవాయ్, సుచిత జలవంచ, నేహ మేడికాయాల, వెంకట్ మద్దూరి, సుహాస్ మాదిరాజు, సంతోష్ నూకల, సాహితి కొర్రపాటి
గీతిక కొర్రపాటి, సరయు ఆదాల, హర్షిత పుల్లెల, శ్రియ మాధవరం, అవనీష్ మాధవరం, మేఘన వట్టిగుంట, ధన్వి గూడే
ఈ నాటికకు సాంకేతిక సహకారం రఘునాద్ కొత్త .
ఈ పిల్లలందరూ కూడా తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు. వారికి మన సంస్కృతిని గురించి చెప్పడం కంటే నాటిక రూపంలో అయితే బాగా అర్ధమవుతుందని వారితో ఈ నాటిక వేయించడం జరిగింది.
– జ్యోతిర్మయి
దసరా సంబరాలు – 1
…
దసరా సంబరాలు – 2
..
Pablu, shreeya, Harshita స్టేజి మీద వుంటారు..
Harshi దసరా అంటే ఏ౦టన్నయ్యా ?
Pablu దసరా ఒక పండుగ. ఆ పండుగ వెనుక ఓ పే……….ద్ద కథ వుంది.
Shree wow i love strories.
Pablu పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఒంటి కాలు పై తపస్సు చేశాడు.
Shree one leg ? (పిల్లలిద్దరూ ఒక్క కాలు మీద నిలబడడానికి ట్రై చేస్తారు)
Pablu yep అపుడు బ్రహ్మ ప్రత్యక్షమై “భక్తా నీ భక్తికి మెచ్చితిని ఏదైనా వరం కోరుకో”
అన్నాడు. (acts like Brahma)
Harshi ఏం వర౦ అడిగా డబ్బా ?
Pablu తనకు చావే లేని వరమిమ్మన్నాడు.
Shree no death(surprisingly)
Harshi (భయంగా )ఇచ్చాడా?
Pablu ఇవ్వలేదు. “నాయనా పుట్టిన ప్రతివానికి గిట్టక తప్పదు. అలంటి వరం నేనివ్వ
లేను” అన్నాడు బ్రహ్మ
Harshi పాపం తపస్సంతా వేస్ట్.
Pablu సరిగ్గా మహిషాసురుడు కూడా ఇలాగే ఆలోచించి, అయితే ఒక స్త్రీ అ౦టే woman
చేతిలో చనిపోయే వరమివ్వమన్నాడు.
Shree why! may be he thought women are not strong enough to kill him so that he can live forever.
Pablu you got it. అందుకే.
Shree mahishasura is so smart. Next time when i go to india i would like to visit mahishasura.
Harshi ok do that. he will kill you and eat you up like a baby carrot.
Pablu అగండాగండి కథ పూర్తిగా వినకుండానే. అప్పుడేమో మహిషాసురుడు ” నాకిక తిరుగు లేదు
నన్నెవరూ చంపలేరు” అంటూ అందరినీ వేధించి బాధలు పెట్టసాగాడు.
Shree ప్చ్. Brahma Devudu shouldn’t have given the boon to him.
Harshi మరేమో తపస్సు చేసాడు గామ్మా.
Pablu వూ…వూ… పూర్తిగా వినండి. ఆ రాక్షసుడు తన సైనికులనులను, “ఎవరైనా దేవతలను పూజిస్తే వారిని
చిత్ర హింసలు పెట్టండి” అని పంపిచాడు.
Shree jai mahishaasura jai jai mahishaasura jai mahishaasura jai jai mahishaasura (అని ఇద్దరూ భజన
చేస్తారు)
pablu ఏం చేస్తున్నారు ?
Shree praying mahishasura, so that we wont be in trouble.
Pablu బాధలొస్తాయని రాక్షసుని పూజిస్తారా? చివరకు ఏమౌతుందో వినండి. దేవతలంతా ఒక చోట సమా వేశమయ్యారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య తేజస్సు నుండి దుర్గాదేవి ప్రత్యక్షమయ్యింది దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలను ఆ దేవత కిచ్చారు.
(ముగ్గురూ లోపలి వెళ్లి పోతారు)
scene 2.
(మహిషాసురునికి s v రంగారావు dialogs action ) మహిషాసురుడు వేదిక మీదకు వస్తాడు పెద్ద సౌండ్ వస్తుంది
మహిశాసురుడు: ఏమా ధ్వని ఏమా ధ్వని యా (అని అరుస్తూ భయ౦గా చూస్తాడు)(దుర్గాదేవి ప్రవేశిస్తుంది.)
మహిషాసురుడు : వూ… ఇంత శబ్దము చేసినది ఒక స్త్రీయా.
దుర్గాదేవి: మహిషాసురా బ్రహ్మ ఇచ్చిన వరముతో కన్ను మిన్ను కానక నీవు చేస్తున్న ఆక్రుత్యములు నేటితో రద్దు.
మహిషాసురుడు. అబలవు హ…మాతో యుద్దమా? పరిహసించుచున్నవా? విష్ణుమూర్తినే ఓడించి ఇంద్రసింహాసనాన్ని కైవసంచేసుకున్నాం నీవొక లెక్కయా.వూ ……వచ్చిన దారినే తిరిగి వెళ్ళుము.
దుర్గదేవి తిరిగి వెళ్ళుటకా వచ్చినాను. నిన్ను హతమర్చి గాని వెళ్ళను.
మహిషాసురుడు. నా అసమాన సేనా సంపత్తిని చూచితివా?
దుర్గాదేవి నా నిశ్వాసలోనే నీ సేనలతో యుద్ధం చేసే మహాసేన యున్నైదియని గమనించితివా? కాచుకో
(మహిశారుని మీదకుదూకుతుంది ఇద్దరికీ భీకర యుద్ధం జరుగు తుంది
మహిషాసురు పడిపోతాడు) (దుర్గాదేవి సింహంమీద pose )
“ఐ గిరి నందిని” అంటూ పిల్లలు వస్తారు.
పాట అయిపోగానే అందరూ లోపలి వెళుతుండగా హర్షి, పబ్లు , శ్రీయ వస్తారు.
scene ౩
Pablu యుద్ధం చూశారుకడా. ఈ కథ వల్ల మనకేం తెలిసింది?
Shree good always wins against evil.
Harshi కలసి వుంటే కలదు సుఖం అని కూడా. ఎందుకంటే దేవతలందరూ తమశక్తులన్నీ దుర్గాదేవికి ఇవ్వడం వల్లనే కదా రాక్షసుని బాధ నుండి తప్పించుకోగాలిగారు.
Pablu ఆ విజయానికి గుర్తుగా మనం విజయదశమి జరుపుకుంటాం .
Shree o that is the story of dasara.
Pablu అంతే కాదర్రా . ఇంకో కధ కూడా వుంది. (రుచి లోపలినుండి వస్తుంది) ఆ కధ అన్నయ్య చెప్తాడు. (లోపలికి వెళ్లి పోతాడు).
Tarun రాముడెవరో తెలుసా మీకు?
Shree Rama is son of dasaradha. he has three brothers. he went to forest along with his wife and his brother లక్ష్మణ for 14 years.
Harshi అప్పుడేమో రావణాసురుడు సీతనెత్తుకు పోయాడు. రాముడు రావాణాసురినితో యుద్ధం చేసి గెలిచాడు.
Tarun రముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు ఈ విజయదసమినాడే తిరిగి వచ్చారు.
Scene 4
“రామ రామ రామ నీలిమేఘశ్యామ”రామ (రామ, లక్ష్మణులు, సీత, హనుమంతుడు వస్తారు )(పిల్లలు ముగ్గురూ లోపలి వెళ్లి పోతారు) “రామ రామ” సాంగ్
మొదటి పాటలో పిల్లలు ఆహ్వానిస్తుండగా రాముడు, సీత లక్ష్మణ హనుమంతుడు వస్తారు. మంగళం పాటలో పిల్లలు హారతి ఇస్తారు.
రామ రామ పాటలో హనుమంతడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ అందరూ వెళ్లి పోతారు
Harshi విజయ దశమి అంటే ఏంటన్నయ్యా ?
Tarun విజయ అంటే victory విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే విజయ దశమి.
Harshi ఓ
Tarun ఈ దసరా రోజునే పాండవులు.13 సంవత్సరాల అరణ్యవాసం తరువాత జమ్మి చెట్టు మీద ఉంచిన ఆయుధాలను తీసుకుని కుని యుద్ధం చేసి గెలిచారట.
Harshi సరే మనం పండుగ ఎలా జరుపుకుంటాం?
Tarun ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కోలాగా జరుపుకుంటారు. మనం, ఆంధ్ర రాష్ట్రం లో తొమ్మిది రోజులు జరుపుకుంటాం. బొమ్మల కొలువులు పెడతాం. జమ్మి చెట్టుకు పూజాలు చేస్తాం. బత్కమ్మకు పాటలు పాడతా౦ అయ్యవారికి చాలు ఐదు వరహాలు౮ అంటూ పంతులు గారూ పిల్లలు వస్తారు. దసరా వేషాల వాళ్ళు వీధిలో తిరుగు తుంటారు అందులో పేద్ద పులి వేషం భలే వుంటుందిలే.
Shree What is Bommala koluvu?
Tarun మన పురాణాలను మన సంస్కృతిని తెలిపే బొమ్మలను నవరాత్రులు తొమిది రోజులూ exhibition లా పెడతాం. అల్లాగే జమ్మి చెట్టుకు పూజలు చేస్తాం. బతుకమ్మకు పాటలు పాడతాం. అయ్యవారి చాలు ఐదు వరహాలు అంటూ పంతులు గారూ పిల్లలూ వస్తారు. దసరా వేషాల వాళ్ళు వీధిలో తిరుగు తుంటారు అందులో పెద్ద పులి వేషం భలే వుంటుంది లే.
Shree: Who is ayya vaaru?
Tarun అయ్యవారు అంటే టీచర్ గారూ. టీచర్ గారూ ఇంటింటికీ వచ్చి దక్షిణలు తీసికొని ఆ ఇంటి వారిని ఆశీర్వదిస్తారు.
Shree What is a boommala koluvu?
Taruvu బొమ్మల కొలువు అంటే మన సంస్కృతికి, పురాణాలకు సంబంధించిన బొమ్మల ప్రదర్శన.
Harshi మనమూ పండగ చేసి కుందామా?
Tarun అలాగే
బతుకమ్మ మ్యూజిక్ వస్తుంది పిల్లలు ఒక్కొక్కళ్ళు వచ్చి బతుకమ్మలను పెట్టి చుట్టూ తిరుగుతూ డాన్సు చేస్తారు.
బతుకమ్మ డాన్స్
అయ్యవారికి చాలు
పేద్ద పులి, ధరణికి సంబరాలు సాంగ్ dance
The End.
(ధరణికి సంబరాలు పాట సిలికాన్ ఆంధ్ర వారి సౌజన్యంతో)
[జ్యోతిర్మయి - http://themmera.blogspot.