
రచన: కాదంబరి
గాలిపటం! గాలిపటం!
ఆంజనేయునికి చెల్లెలా!
గాలిలోన ఎగురు విద్య
నీకు ఎలా అబ్బినది? ||
కుప్పి గంతుల కోతి
లంకకు – చిటికెలొ ఎలాగ చేరినది?
తోకరాయునికి లంఘనములను
నేర్పిన గురువువు నీవేనా? ||
చందమామ ఇంటిపైన
నామ ఫలకమయ్యావు!
సూర్యుని చిరునామా
నాకు తెలుసునంటావు ||
చుక్కల చెంపలలోన
చెమ్కీలను పూయింతువు
ఎల్లరి మనసు తెరల
ఖుషీ ఫొటో నీవైతివి ||
..
We like this song very much.
We want this type of songs alot.
Thanks for the writer kadambari for being writing wonderful songs for kids and elders too. We wish this continues for long time and everybody likes to read it. Keep writing and god bless u.
bye
Vedagiri Sirisha.
/