రచన : కుసుమ కుమారి
ప్రకృతి అణువణువుతో – నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య – గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణయ్య! ||
అద్రి పూజలను మాకు నేర్పినావు క్రిష్ణ!
“భద్రంగ చేయాలి- గిరి తరువు సంపదలు!
ప్రకృతి మన దేవత” అని సెలవిచ్చినావు; ||
ఆలమంద, పశువులు- ఆలనా పాలనలు
మేలైన అలవాటు మందికి- అంటివి;
జల యమున ఆరాధ్య దేవతని నీ వాక్కు ||
నాట్య నెమలి కనులు – నీ సిగలోని పూవులు;
పక్షులతో ఆటలు కంటి విందులు;
“ప్రకృతియె దేవత”ని సెలవిచ్చినావు; ||
ప్రకృతి అణువణువుతో – నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణా! ||
**

paata baagaaundi.