రమ్య గీతిక /Krishna
ఈ సారి మీకు 9 తో గుణకారం సులువుగా చేసె పద్దతి చెప్తాను.
1) ఏదైనా ఒక సంఖ్య లో ఉన్న అంకె లకు సమానమైన 9 ల తో గుణకారం
ఇచ్చిన సంఖ్య నుండి 1 తీసివేసిజవాబు గా రాసి 9 నుండి ఒక్కో అంకె తీసివేసి పక్కన రాయాలి.
ఉదా:
87X99
87-1=86
86
9-8=1
9-6=3
జవాబు: 8613
5678X9999
5678-1=5677
5677
9-5=4
9-6=3
9-7=2
9-7=2
జవాబు:56774322
468978X999999
468978-1=468977
9-4=5
9-6=3
9-8=1
9-9=0
9-7=2
9-7=2
జవాబు:468977531022
2) ఏదైనా ఒక సంఖ్య లో ఉన్న అంకె లకు ఎక్కువ 9 ల తో గుణకారం
ఇచ్చిన సంఖ్య నుండి 1 తీసివేసిజవాబు గా రాసి తరువాత ఇచ్చిన సంఖ్య కంటె ఎన్ని 9 లు ఉంటె అన్ని 9 లు రాసి ఆ తరువాత 9 నుండి ఒక్కో అంకె తీసివేసి పక్కన రాయాలి
ఉదా:
67X999
67-1=66
66
9
9-6=3
9-6=3
జవాబు:66933
543X99999
543-1=542
542
99
9-5=4
9-4=5
9-2=7
జవాబు:54299457
67567X99999999
67567-1=67566
67566
999
9-6=3
9-7=2
9-5=4
9-6=3
9-6=3
జవాబు:6756699932433
3) ఏదైనా ఒక సంఖ్య లో ఉన్న అంకె లకు తక్కువ 9 ల తో గుణకారం
ఉదా:
ఇచ్చిన సంఖ్య చివర ఎన్ని 9 లతో గుణించితె అన్ని 0 లు వేసుకొని ఆ సంఖ్య నుండి ఇచ్చిన సంఖ్య తీసి వేయాలి.
678X99
67800
67800-678
జవాబు:67122
87656 X 999
87656000
87656000-87656
జవాబు:87568344
హహహ్హా…. అయ్యో ఇంత ఆలస్యంగా ఎందుకు మొదలు పెట్టారు? ఇంకా కొన్ని సంవత్సరాలు ముందే మొదలు పెట్టుంటే నాకీ గణితంలో ఇబ్బందులేమి ఉండేవి కాదు కదా!