ఆగష్టు నెల
- Kr geetika
ఆగష్టు నెల అనగానే ముందుగా గుర్తొచ్చేవి వర్షాలు. ఈ నెలంతా వచ్చీ పోయే వానలు, పచ్చటి ప్రకృతి తో చల్లగా, పచ్చగా ఉంటుంది. ఈ మాసం అంతా వరసగా పండగలు ఉంటాయి. ఇది పెళ్ళిళ్ళ కాలం కూడా.
ఈ మాసం నుండి మహా విష్ణువు విశ్రాంతి లోకి వెళతాడని అంటారు. చతుర్మ్యా దీక్ష ఆరంబిస్తారు.
నోములు, వ్రతాలు ఈమాసమంతా పండగవాతావరణంతో ఉంటుంది.
ఈ నెలకు ఆగస్ట్ అనే పేరు ఎలావచ్చిందో తెలుసా. జూలియస్ సీజర్ అంతకుముందు పదినెలలు ఉన్న క్యాలెండర్ మార్చి పన్నెండు నెలలుగా చేసాడు. మొదట పదినెలలలో ఆరవదైనందున దీని పేరు అప్పుడు ’సిక్స్ టైలీస్’. పన్నెండు నెలలుగా మార్చి తరువాత మొదటి పేరుని జూలియస్ సీజర్ తమకు రాజైన అగస్టస్ సీజర్ పేరున ఈ నెలకు ’ఆగస్టు’ అని పేరు పెట్టాడు.
మన తెలుగు సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ మాసంలో వస్తుంది. ఈ సమయంలో శ్రావచతుర్మ్యాస దీక్ష ఆరంబిస్తారు. శ్రావణ నక్షత్ర పరిధిలో సూర్య చంద్రులు పరిభ్రమిస్తూ ఉన్నందున శ్రావణ నక్షత్రం పేరున ఈ మాసాన్ని ’శ్రావణమాసం’ అంటారు.
బాల గంగాధర్ తిలక్ ఈ నెల 1 న జన్మించారు. పింగళి వెంకయ్య ఆగష్టు 2న జన్మించారు. ఝాన్సీ లక్ష్మీబాయ్ జన్మదినం 16. మహర్షి అరవిందుడు 15 న జన్మించాడు.
9 క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగష్టు 15.
ఈనెల 5 రాఖీ పౌర్ణమి, 13 కృష్ణాష్టమి., 23 వినాయక చవితి పండగలు.
ఆగస్టు ఐదున ఫ్రెండ్షిప్ డే, పన్నెండున ఇంటర్నేషనల్ యూత్ డే మరియు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు.

NICE TO KNOW ABOUT THIS MONTH