సేకరణ – బిట్టు
నీళ్ళలో గ్లూకోజ్ కలిపితే నీళ్ళు చల్లగా మారతాయి ఎందుకో తెలుసా.
గ్లూకోజ్ కలిపిన నీళ్ళు ఒక ద్రావణం. ద్రవం ద్రావణం గా మారటానికి ఘనపదార్ధాన్ని కలపాలి. అది భౌతిక రసాయనిక ప్రక్రియ. అలా కలిసినప్పుడు పదార్ధాలమధ్య అణుస్థాయిలో జరిగే పరస్పర చర్యల వల్ల ఊష్ణ శక్తి లో మార్పు( ఊష్ణ శక్తి గ్రహించటం లేదా విడుదల చేయటం) జరుగుతుంది.
స్ఫటిక నిర్మాణంలో ఉన్న గ్లూకోజ్ నీటిలో కలిసినప్పుడు అది విచ్చిన్నమౌతుంది. వాటి అణువుల మధ్యౌన్న బంధం విడదీయటానికి కొంత శక్తి అవసరం. ఈ శక్తి నీటి ద్వార గ్రహించటం వల్ల నీరు చల్లగా మారుతుంది.
ట్రాఫిక్ లో ఆగండి అనే సిగ్నల్ కి మరియు డేజంర్ సిగ్నల్ కి ఎరుపురంగే ఎందుకు!
ఎరుపురంగుకి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. దాని కాంతి ఎక్కువ వేగాన్ని కలిగిఉంటుంది. దాని పరిక్షేపణ సామర్ధ్యం తక్కువ అందువల్ల ఎక్కువ దూరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుణాలవల్ల ఎరుపు రంగు వాడుతారు.
మీకు తెలుసా
౧; జిరాఫీ మెడపొడవు దాదాపు రెండు మీటర్లు. దాని మెడలో ఉండేవి ఏడు ఎముకలు మాత్రమే. మనిషి మెడలో ఉండే ఎముకలు కూడా ఏడు.
౨) 1405 ఫారన్హీట్ డిగ్రీలదాకా వేడిచేస్తే వజ్రం ఆవిరిగా మారుతుంది.
౩) చింపాజీలకు మనుషులకు డీ ఎన్ ఏ లో ఒక్క శాతమే తేడా. రక్తం, మూత్రపిండాలు మార్పిడి చేసుకోవచ్చట.
చాలా బాగున్నాయి
good