రచన : రమ్య గీతిక
పిల్లలు మీకు మ్యాథ్స్ అంటే భయమా! మ్యాథ్స్ అంటే భయపెట్టే సబ్జెక్టే కాదు.
సులువయిన పద్దతులు మరియు తమాషా లెక్కలు కూడా ఉంటాయి.
కొన్ని గుణకారాలకు సులువయిన పద్దతి మనమిప్పుడు చూద్దాం.
మనకందరికి 10 టేబుల్ ఇష్టం కదా. ఎందుకంటె అది సులువు కాబట్టి.
10X4 అనగానే 40 అని చెప్పేస్తాం. 4 పక్కన 0 పెడితె సరిపోతుంది. అలా ఎంత పెద్దదయినా చెప్పొచ్చు.
అలాగె 11 టేబుల్ కూడా సులువుగా చెప్పెయవచ్చు.
ఉదా: 11X21 అడిగితె ఎంతో సమయము కావాలి. గుణకారం చేసుకోవాలి.
కాని ఈ పద్దతి లో కొన్ని సెకన్స్ లో చెప్పవచ్చు.
ఇక్కడ 11 తో 21 గుణకారం కావున 2 1 మధ్యలో ఖాళి వేసుకోవాలి. దానిలొ2+1 వేసుకోవాలి. అంటె జవాబు 231
అలాగే
11X43
4 (4+3) 3
473
ఇలా అన్నమాట.
ఇంకా చాలా మందికి 10 టేబుల్ వరకు ఈసీ గా వస్తాయి. దానిపైన మల్టిప్లికేషన్
అంటె చాలా సమయం పడుతుంది కదా.
దానికి ఓ సులువైన పద్దతి ఉంది.
16X14 అడిగారనుకోండి.
అదంతా మనసులో మల్టిప్లికేషన్ అంటె కొద్ది గా కష్టం
మనకు 10 టేబుల్ ఈసి కాబట్టి దానితొ సులువుగా చేయవచ్చు.
ఉదా:
మొదటి సంఖ్య 16X10– 160
రెండవ సంఖ్య లోని 4X10– 40
మొదటి,రెండవ సంఖ్యలోని రెండవ అంకెలు 6X 4– 24
——–
224
అని మనసులో వేసుకొని కొన్ని సెకండ్స్ లో చెప్పవచ్చు.
అలాగె మరికొన్ని
18×12
18X10=180
2X10= 20
8X2 = 16
———
216
ఇంకొన్ని తమాషాలతో వచ్చే నెల కలుద్దాం.