రచన : బిట్టు
నాకు కార్టూన్స్ చూడ్డం అంటే ఇష్టం. నేను చూసే కార్టూన్స్ గురించి ఇప్పుడు మీకు చెపుతాను.
డోరమాన్ కార్టూన్. ఇది హంగామా చానెల్ లో వస్తుంది.
డోరమాన్ అనేది ఫ్యూచర్ నుండి వచ్చిన ఒక రోబోట్ పిల్లి. అది నోబితా అనేఅ బ్బాయికి సాయం చేయటానికి వస్తుంది. దాని చిన్న జేబునుండి గాడ్జెట్స్ తీసి నోబితాను కాపాడుతుంది. మామూలు పిల్లులకి ఎలుకలు ఆహారం, కానీ దీనికి ఎలుకలు అంటే భయం.
నోబితా వాడి స్నేహితులతో కలిసి సాహసాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు కష్టాల్లో చిక్కుకంటే డోరోమాన్ కాపాడుతుంది.

విక్కి ఔర్ వేతాల్.
ఇది కార్టున్కాదు. ఇది ఎపిసోడ్లుగా వచ్చే సీరియల్.
ఇదికూడా చాల బావుంటుంది, నవ్వుతెప్పిస్తుంది.
మొదటి ఎపిసోడ్ లో విక్కి అనే అబ్బాయి తన స్నేహితుడైన సిడ్ రాత్రిపూట స్మశానానికి వెళ్ళి ఒక చెట్టుని తాకాలి అని పందెం వేసుకుంటారు. కానీ సిద్ భయంతో వెళ్ళలేక వచ్చేస్తాడు. విక్కి ధైర్యంగా వెళ్ళి ఆ పెద్ద చెట్టుని తాకగానే గాలివీచి కళ్ళుతరిగి పడిపోతాడు.
కళ్ళు తెరచి చూసేసరికి ఇంట్లో నిద్రలేస్తూ ఉంటాడు, అతని డ్రెస్ మారిపోయి ఉంటుంది. అన్నీ వింతలు జరుగుతూ ఉంటాయి.
తరువాత విక్కి కి వేతాల్ కనిపిస్తాడు. వేతాల్ ఇంకెప్పుడూ విక్కితోనే ఉంటాడు. వేతాల్ దగ్గర పద్దు అనే మేజిక్ బుక్ ఉంటుంది.ప్రతి ఎపిసోడ్ లో వేతాల్ గందరగోళం చేస్తూ ఉంటాడు. చివరకు పద్దు వచ్చి అంతా సరిచేస్తాడు. ఇవన్ని చాలాఅఆసక్తిగా ఉంటాయి, నవ్వుతెప్పిస్తు ఉంటాయి.
ఇంకా కొన్నింటి గురించి మరొక సారి రాస్తాను.