ఫర్ కిడ్స్ కి స్వాగతం.
చిన్నారులకు అవసరమైన ప్రతి ఒక్కటి ఇక్కడ కూర్చి పెట్టాలనేదే లక్ష్యం.
ఫర్ కిడ్స్ ఒక్కొక్కటిగా కొత్త హంగులను చేర్చుకుంటూ ముందుకు సాగుతొంది.
ఇక్కడి కథలు కబుర్లు పిల్లలకి చెప్పండి. చిట్టిపొట్టి పాటలు నేర్పండి. ఆటలతో వాళ్ళని ఉత్సాహపర్చండి.
కథలు, ఆటపాటలలోంచి పిల్లలు వికసిస్తారు. వారి ఎదుగుదలలో కథకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. లోకం పోకడలు తెలుస్తాయి. ఊహాశక్తి, కల్పనా సామర్ధ్యం పెరుగుతుంది. విచక్షణ, వ్యవహార దక్షత అలవర్చుకుంటారు. సాహిత్యం పై మక్కువ పెంచేది కథ. వాక్యనిర్మాణం, పదజాలాభివృద్ది కూడా మెరుగుపడతాయి.
కథలు విన్నాక, చదివాక పిల్లలు ఊరుకోరు. వాళ్ళు కొత్త కథలు చెపుతారు. వాళ్ళ ఊహల్ని కథలుగా మలిచేలా ప్రోత్సాహించండి. వాళ్ళు విన్న, కన్న, ఊహించిన వాటిని కథలుగా వ్యాసాలుగా ప్రాణం పోసుకోనివ్వండి. ఏదిచూసినా దానిపై చిట్తిపొట్టి వ్యాసాలు రాసేలా ప్రోత్సాహించండి. మీరూ వాళ్ళకోసం రాయండి.
చిన్నారులకోసం ఆటపాటల్ని, కథల్నీ పోగేద్దాం…
చిన్నారులు కథలు, ఆటపాటలు, వ్యాసాలు, కబుర్లు ఇలా ఏదైనా మీ సృజనాత్మకసృష్టి ని ఇక్కడ పంచుకుంటూ తద్వారా మీ ఆలోచనలనూ, అభిప్రాయాలను, కల్పనా శక్తినీ వికసింపజేసుకోవచ్చు. భావితరానికి సాహితీప్రియులనీ, రచయితలనీ అందించాలనే ఆకాంక్షకి మీ అందరి ఆశిస్సులు, అభిమానం ఎంతో అవసరం వాటిని అందిస్తూ మాతో పాలు పంచుకోమని కోరుతూ…….
మీ
Kr geetika
Himabindu Tirunagari
admn.forkids@gmail.com
Wonderful site. All the best
Nice patrika.
We are waiting for new issue
“Forkids” Madam!.
ధన్యవాదాలు vedagiri Sirisha గారు.
Thankyou.
Hai madam. Mee for kids site chala bavundhi. chakkani kadalu istunnaru. naku kadalu kavithalu raase alavatu vundhi nenu mee site ki pampinchavachuna